27న ముగియనున్న మండలపూజ.. శబరిమలకు పోటెత్తుతున్న భక్తులు
- 26న ఉదయం 7:30 గంటల నుంచి నాలుగు గంటలపాటు ఆలయం మూత
- ఎరుమేలి-పంబ ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- అయ్యప్ప నామ స్మరణతో హోరెత్తుతున్న శబరిగిరులు
మరోవైపు, ఎల్లుండి సూర్యగ్రహణం కావడంతో ఆ రోజు ఉదయం 7:30 గంటల నుంచి నాలుగు గంటలపాటు అంటే ఉదయం 11:30 వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ మూసివేతకు ముందే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.