క్రైమ్ థ్రిల్లర్ తో సెట్స్ పైకి యంగ్ హీరో
- ఆది సాయికుమార్ పుట్టినరోజు ఈ రోజు
- క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తాజా చిత్రం
- ఆసక్తిని రేకెత్తిస్తోన్న పోస్టర్
అలా ఆయన ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందనుంది. ఈ రోజున ఆది సాయికుమార్ పుట్టినరోజు కావడంతో, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమాకి సంబంధించిన ఒక కాన్సెప్ట్ పోస్టర్ ను వదిలారు. హీరో ఫేస్ షాడోపై దేవాలయం .. మసీదు .. చర్చ్ నేపథ్యంలోని దృశ్యాలతో రూపొందించిన ఈ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది .. ఆలోచింపజేస్తోంది. ఈ సినిమా ద్వారా శివశంకర్ దేవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.