పౌరసత్వ సవరణ చట్టంపై సీఎం కేసీఆర్ తన వైఖరిని స్పష్టం చేయాలి: వీహెచ్
- ముస్లింలు, ఎస్సీలను సీఎం మోసం చేస్తున్నారు
- హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం పెడతానని ఎందుకు పెట్టలేదు?
- కేసులు పెట్టినా.. భయడను
‘హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహం పెడతానని ఎందుకు పెట్టలేదు? సీఎం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం లేదని తాము విగ్రహాన్ని తీసుకొస్తే.. రెండు నెలలుగా ఈ విగ్రహాన్ని పోలీసు స్టేషన్ లోనే పెట్టారు. నాపై కేసు కూడా పెట్టారు. ఈ కేసులకు భయడను. బీజేపీతో పొత్తు ఉన్న బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా పౌరసత్వ సవరణ చట్టంపై తన వైఖరిని స్పష్టం చేశారు. చట్టాన్ని అమలు చేయమని ప్రకటించారు’ అని వీహెచ్ అన్నారు.