బాలకృష్ణ సినిమాకి బోయపాటి డివోషనల్ టచ్ ఇస్తున్నాడట!
- బాలకృష్ణతో బోయపాటి మూడో సినిమా
- 70 కోట్ల బడ్జెట్ తో సెట్స్ పైకి
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథాకథనాలు
ఈ నేపథ్యంలో ఈ సినిమాలో బోయపాటి డివోషనల్ టచ్ కూడా ఇవ్వనున్నాడనేది తాజా సమాచారం. ఇంతవరకూ యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ వచ్చిన బోయపాటి, ఈ సారి గ్రామీణ నేపథ్యంలో కథ అల్లుకుని, ఆ కథలో డివోషనల్ టచ్ ఉండేలా చూసుకున్నాడని అంటున్నారు. 70 కోట్ల బడ్జెట్ తో మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో, కథానాయిక ఎవరనేది త్వరలోనే వెల్లడించనున్నారు.