యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న 'టక్కర్'
- సిద్ధార్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్
- కథానాయికగా దివ్యాన్ష కౌశిక్
- ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు
తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాకి 'టక్కర్' అనే టైటిల్ ను ఖరారు చేసి, వరుణ్ తేజ్ చేతుల మీదుగా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయించారు. టైటిల్ కి మంచి మార్కులు పడిపోయాయి. దివ్యాన్ష కౌశిక్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అభిమన్యు సింగ్ .. యోగిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.