అభిరామ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన సురేశ్ బాబు
- వెంకటేశ్ హీరోగా 'అసురన్' రీమేక్
- నటనలో శిక్షణ తీసుకుంటున్న అభిరామ్
- సోలో హీరోగానే అభిరామ్ పరిచయం
ఈ సినిమాలో వెంకటేశ్ చిన్న కొడుకుగా అభిరామ్ పరిచయం కానున్నాడనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై సురేశ్ బాబు క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా అభిరామ్ ను పరిచయం చేసే ఉద్దేశం లేదనీ, సోలో హీరోగానే అభిరామ్ ను పరిచయం చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం అభిరామ్ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని అన్నారు. మొత్తానికి అభిరామ్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతుందన్న మాట.