ఈ అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉంది: ప్రియాంకా చోప్రా
- 15 ఏళ్లుగా బాలల హక్కుల గుడ్ విల్ సంస్థకు ఆమె అంబాసిడర్
- న్యూయార్క్ లో అవార్డు అందుకున్న ప్రియాంక
- ప్రియాంక సేవా గుణం తనకు స్ఫూర్తి అన్న భర్త
న్యూయార్క్ లో మంగళవారం జరిగిన యూనిసెఫ్ స్నోఫేక్ బాల్ 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ డయాన్ వాన్ ఫర్ స్టెన్ బర్గ్ ఆమెకు ఈ అవార్డును అందజేశారు. ఈ సంతోషకర క్షణాలను ఆమె తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. తనకు ఈ అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉందంటూ ఆమె పోస్ట్ చేశారు. తన భార్య చేస్తున్న సేవా కార్యక్రమాలు తనకు కూడా స్ఫూర్తి దాయకంగా ఉంటాయని, ప్రియాంకకు ఈ గౌరవం దక్కడం తనకు ఎంతో సంతోషాన్నికలిగించిందని ఆమె భర్త నిక్ జోనాస్ తన స్పందనను తెలియజేశారు.