షేక్ హ్యాండ్ ఇవ్వలేదని చిన్నబుచ్చుకున్న చిన్నారి... ఇంటికెళ్లి ముచ్చట తీర్చిన అబూదాబి యువరాజు... వీడియో ఇదిగో!
- విందుకు హాజరైన అబూదాబీ యువరాజు
- కరచాలనం కోసం లైన్లో నిలబడ్డ బాలిక
- పట్టించుకోకుండా వెళ్లిపోయిన యువరాజు
- వైరల్ అయిన వీడియోను చూసి బాలిక ఇంటికి
ఆ యువరాజు అబుదాబి యువరాజు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ కాగా, చిన్నారి పేరు ఐశా మహమ్మద్ మషీత్ అల్ మజ్రౌవీ. జాయెద్ ఓ విందుకు హాజరైన వేళ ఈ ఘటన జరిగింది. యువరాజుకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పరుగున వచ్చి వరుసలో నిలబడిన ఐశా, తన కోరిక తీరకపోవడంతో చిన్నబుచ్చుకుంది. ఆ సమయంలో తీసిన వీడియోను చూసిన జాయెద్, ఆమె ఇంటికి వెళ్లారు. దీంతో ఐశా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. చిన్నారి పట్ల యువరాజు వ్యవహరించిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.