కథా రచయితగా కనిపించనున్న విజయ్ దేవరకొండ
- విభిన్నమైన ప్రేమకథగా 'వరల్డ్ ఫేమస్ లవర్'
- సంగీత దర్శకుడిగా గోపీసుందర్
- ఫిబ్రవరి 14వ తేదీన విడుదల
ఈ సినిమాలో ఆయన కథా రచయితగా కనిపిస్తాడట. ఆయన రాసే కథలోని పాత్రలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తాయట. ఇలా ఒక విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా నిర్మితమవుతోందని అంటున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాకి క్రాంతిమాధవ్ దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.