దిశ హత్య కేసు నిందితుల వీడియోను తీసిన కానిస్టేబుల్ సస్పెన్షన్!
- చర్లపల్లి జైలులో నిలబడివున్న నిందితులు
- మీడియాలో వీడియో వైరల్
- చిత్రీకరించిన కానిస్టేబుల్ రవిపై కేసు
పోలీసు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన రవిపై చర్యలు తీసుకోవాలని సీపీలు సజ్జన్నార్, మహేశ్ భగవత్ లకు చర్లపల్లి జైలు అధికారులు సిఫార్సు చేశారు. దీంతో కానిస్టేబుల్ రవిపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభమైంది. ఇదే సమయంలో రవిని సస్పెండ్ చేస్తున్నట్టు సైబరాబాద్ కమిషనరేట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇటువంటి వీడియోలు బయటకు రావడం, వాటిని మీడియాలో విస్తృతంగా చూపడం వల్ల కోర్టులో కేసు బలహీనమవుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు.