పంత్.. అవకాశాలను సద్వినియోగం చేసుకో!: వీవీఎస్ లక్ష్మణ్
- జట్టులో స్థానం కోసం పోటీ నెలకొంది
- బ్యాకప్ గా సంజు శాంసంగ్ సిద్ధంగా ఉన్నాడు
- పంత్ ఇప్పటికీ అద్భుతమైన బ్యాట్స్ మన్
‘సంజు శాంసన్ రూపంలో బ్యాకప్ ఉన్నాడు. జట్టు యాజమాన్యం, సెలక్షన్ కమిటీ ఇప్పటికే సందేశం పంపింది. పంత్ కు వారు చాలా అవకాశాలిచ్చారు. అతడిప్పటికీ అద్భుతమైన బ్యాట్స్ మన్ అని నా నమ్మకం. గుడ్ లెంగ్త్ బంతులను సైతం సిక్సర్లుగా మార్చడంలో దిట్ట. మ్యాచ్ లను మలుపు తిప్పే సామర్థ్యం అతని సొంతం. ఎందుకనో ఇటీవల బ్యాట్స్ మెన్ గా అతడి ఆలోచనల్లో స్పష్టత లోపించింది. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు’ అని వీవీఎస్ వ్యాఖ్యానించాడు.