నగ్నంగా అపార్ట్ మెంట్ పై నుంచి పడిపోయిన మోడల్.. హత్యే అంటున్న పోలీసులు!
- 2017లో కౌలాలంపూర్ లో ఘటన
- 20వ ఫ్లోర్ నుంచి కిందపడ్డ 18 ఏళ్ల ఇవానా
- తొలుత దీన్ని ప్రమాదంగానే భావించిన పోలీసులు
ప్రమాదం జరిగిన అపార్ట్ మెంటులో ఓ అమెరికన్ వ్యక్తి, అతని భార్య (కజక్ జాతీయురాలు)తో కలసి భారీ మొత్తంలో స్మిత్ డ్రగ్స్, ఆల్కహాల్ తీసుకుందని... వారంతా గ్రూప్ సెక్స్ లో పాల్గొన్నారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే, దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు... తొలుత దీన్ని ప్రమాదంగానే భావించారు. అపార్ట్ మెంట్ పై నుంచి కిందకు పడే ముందు చిన్న గొడవ జరిగి ఉండవచ్చని అప్పట్లో తెలిపారు.
ఈ నేపథ్యంలో, ఇవానా స్మిత్ కుటుంబసభ్యులు గత వారంలో పోలీసుల వాదనను హైకోర్టులో సవాల్ చేశారు. తెలిసిన వారు కానీ, తెలియని వారు కానీ ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని కోర్టుకు విన్నవించారు. దీంతో, కేసును మళ్లీ దర్యాప్తు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
తాజా విచారణలో ఇవానా స్మిత్ ది ముమ్మాటికీ హత్యేనని పోలీసులు తేల్చారు. ఈ కేసును ప్రస్తుతం మర్డర్ కేసుగా మార్చామని... సాక్షులందరినీ మరోసారి విచారిస్తామని తెలిపారు. అయితే ఈ కేసుతో సంబంధం ఉన్న దంపతులు ఇప్పటికే మలేషియాను వీడి వెళ్లిపోయారు.