కొత్త సినిమా కోసం బెల్లంకొండ సిక్స్ ప్యాక్
- బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రానికి సన్నాహాలు
- రేపు ఉదయం పూజా కార్యక్రమాలు
- కొత్త లుక్ తో కనిపించనున్న బెల్లంకొండ
'కందిరీగ' దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తో ఆయన ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ గుబురు గెడ్డం .. కొత్త హెయిర్ స్టైల్ తో .. సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. సిక్స్ ప్యాక్ కోసం జిమ్ లో ఆయన గట్టి కసరత్తులే చేశాడు. రేపు (శుక్రవారం) ఉదయం హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో ఈ సినిమాను లాంచ్ చేస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ బాణీలను అందిస్తున్నాడు.