రామారావుగారిని చూసి అందుకే అంతా భయపడేవారు: నటుడు శివకృష్ణ
- రామారావుగారు నాకు దేవుడుతో సమానం
- అయన ఎవరినీ ఏమీ అనేవారు కాదు
- సంస్కారం వున్నవారిని అభిమానిస్తారన్న శివకృష్ణ
అప్పటివరకూ హీరోగా చేసిన నేను, రామారావుగారితో అనే సరికి చిన్న పాత్రను చేయడానికి కూడా అంగీకరించాను. రామారావుగారి నిలువెత్తు విగ్రహం .. ఆయన గంభీరంగా వుండే తీరు .. ఆయన క్రమశిక్షణ చూసి మిగతా వాళ్లు భయపడేవారు. అంతేగానీ ఆయన ఎవరినీ ఏమీ అనేవారు కాదు. సభ్యత .. సంస్కారం వున్న వారిని ఆయన మరింత అభిమానిస్తారు. ఆయన నా పట్ల చూపిన అభిమానాన్ని .. ప్రోత్సహించిన తీరును నేను ఎప్పటికీ మరిచిపోలేను" అని చెప్పుకొచ్చారు.