30 ఏళ్ల స్నేహాన్ని మరిచి పదవికోసం ఇతరులతో జట్టు కట్టారు: శివసేనపై కేంద్రమంత్రి రవి శంకర్ విమర్శ
- మహారాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకే ప్రభుత్వం ఏర్పాటు చేశాం
- ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది
- అధికారం కోసం రాజీ పడేవాళ్లు శివాజీ గురించి మాట్లాడొద్దు
‘30ఏళ్ల స్నేహాన్ని మరిచి ఇతరులతో జట్టు కట్టడం ప్రజాస్వామ్యం ఖూనీ కాదా? అధికారం కోసం రాజీ పడేవాళ్లు శివాజీ గురించి మాట్లాడక పోవడమే మంచిది. గవర్నర్ మూడు పార్టీలనూ ఆహ్వానించారు. తమ వద్ద సంఖ్యాబలం లేదని బీజేపీ అప్పుడు చెప్పింది. మరింత సమయం కావాలని ఎన్సీపీ కోరింది’ అని రవిశంకర్ పేర్కొన్నారు.