'సోలో బ్రతుకే సో బెటర్' రిలీజ్ డేట్ ఖరారైపోయినట్టే
- తేజు తాజా చిత్రంగా రానున్న 'ప్రతిరోజూ పండగే'
- తదుపరి సినిమాగా 'సోలో బ్రతుకే సో బెటర్'
- మే 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు
మే 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చినట్టుగా చెబుతున్నారు. మార్చి .. ఏప్రిల్ మాసాల్లో అంతా పరీక్షల హడావిడిలో వుంటారు. అందువలన మే 1వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారట. ఆ రోజున సెలవు కూడా కలిసొస్తుండటంతో, అదే రోజున విడుదల తేదీ ఖరారైపోవచ్చని అంటున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమాలో, తేజు సరసన నాయికగా నభా నటేశ్ కనిపించనుంది.