'అంధాదున్' తెలుగు రీమేక్ కి దర్శకుడు ఖాయమైపోయినట్టే
- వరుస ప్రాజెక్టులను సెట్ చేసుకున్న నితిన్
- 'అంధాదున్' రీమేక్ కి సన్నాహాలు
- త్వరలోనే పూర్తి వివరాలు
ఈ క్రమంలో సుధీర్ వర్మని దర్శకుడిగా ఎంచుకున్నట్టుగా ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. 'స్వామిరారా'తో తన కెరియర్ ను మొదలెట్టిన సుధీర్ వర్మ, 'రణరంగం' వరకూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 'అంధాదున్' కథకి సుధీర్ వర్మ టేకింగ్ ప్లస్ అవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు ఆయన పేరు ఖరారైపోయిందనే అంటున్నారు.