టైమ్ మెషీన్ కాన్సెప్ట్ తో కల్యాణ్ రామ్
- సంక్రాంతికి 'ఎంతమంచివాడవురా'
- గుహన్ దర్శకత్వంలో మరో మూవీ
- మల్లిడి వేణుతో ప్రయోగాత్మక చిత్రం
500 ఏళ్లకి ముందు కథ .. ఆ తరువాత కథగా ఈ సినిమా సాగుతుందని అంటున్నారు. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే ఫొటో షూట్ ను పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. 'ఎంతమంచివాడవురా' సినిమాను పూర్తి చేసిన కల్యాణ్ రామ్, ఆ తరువాత 'గుహన్' దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నాడు. ఆ తరువాతనే మల్లిడి వేణు ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు.