మహేశ్ బాబు చేతుల మీదుగా నరేశ్ మూవీ ట్రైలర్ రిలీజ్
- తెలుగు తెరపైకి 'రఘుపతి వెంకయ్య నాయుడు'
- ప్రధాన పాత్రధారిగా సీనియర్ నరేశ్
- ఈ నెల 29వ తేదీన విడుదల
ఈ నెల 29న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా టీమ్ కి మహేశ్ బాబు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. రఘుపతి వెంకయ్య నాయుడు బాల్యం .. యవ్వనం .. సినిమాల పట్ల ఆయనకి ఆసక్తి పెరిగిన తీరు .. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఆయన పడే తపన .. ఆయన చివరి రోజులకి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సీనియర్ నరేశ్ ప్రధాన పాత్రధారిగా సతీశ్ బాబు నిర్మించిన ఈ సినిమాకి, బాబ్జీ దర్శకుడిగా వ్యవహరించాడు.