చిరంజీవి గారు ఓ పాట చేయాలని అడిగారు... అది లైవ్ లో చూపించలేదు: బాబా భాస్కర్
- బిగ్ బాస్-3లో టాప్-3లో ఒకడిగా నిలిచిన బాబా
- చిరు ప్రశంసలు
- పొంగిపోయిన కొరియోగ్రాఫర్
"చాలాకాలం తర్వాత నేను మళ్లీ సినిమాల్లోకి వచ్చాను, ఖైదీ నెం.150 సినిమా కూడా చేశాను. నా కొత్త సినిమా కోసం ఓ పాట చేస్తావా? అని చిరంజీవి గారు అడిగారు. తప్పకుండా చేస్తాను సార్, మీరు అడిగితే చేయకపోవడం ఏంటి సార్" అన్నానని బాబా వివరించారు. ఇది తాను హౌస్ లో ఉన్నప్పుడు చిరంజీవి గారు స్టేజ్ మీద ఉండి అడిగారని తెలిపారు. ఇక స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత, నేను మీ ఫ్యాన్ ను సార్ అంటే, నేనే మీకు పెద్ద ఫ్యాన్ ను బాబా అని చిరంజీవి గారు అనడం మర్చిపోలేనని వెల్లడించారు.