బాలుడు 'ఆంటీ' అని పిలిచాడంటూ.. కోపంతో దుర్భాషలాడిన బాలీవుడ్ నటి.. వీడియో వైరల్
- తన కెరీర్ ఆరంభంలో ఓ ప్రకటనలో నటించానన్న స్వరా భాస్కర్
- ఆ సమయంలో ఓ బాలనటుడు ఆంటీ అన్నాడని వెల్లడి
- 'నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్'కు ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు
ఆ సమయంలో తాను నిరాశకు గురయ్యానని స్వరా భాస్కర్ చెప్పింది. పిల్లలు దయ్యాలతో సమానమని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించిన ఈ వీడియో బయటకు వచ్చింది. అయితే, షోలో ఇలా ఆమె దుర్భాషలాడడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గతేడాది పిల్లలపై వేధింపులకు వ్యతిరేకంగా స్వరా భాస్కర్ ప్లకార్డులు పట్టుకుని ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఓ వైపు బుద్ధులు చెబుతూ, మరోవైపు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు.