'పింక్' రీమేక్ కోసం పవన్ పారితోషికం 40 కోట్లు?
- హిందీలో హిట్ కొట్టిన 'పింక్'
- తమిళంలోను భారీ విజయం
- సెట్స్ పైకి వెళ్లనున్న తెలుగు రీమేక్
ఈ సినిమాలో కథానాయకుడిగా పవన్ కల్యాణ్ నటిస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నాడనే విషయం ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి పవన్ అందుకోనున్న పారితోషికం గురించిన చర్చలు ఫిల్మ్ నగర్లో జోరుగా నడుస్తున్నాయి. ఈ సినిమాకి పారితోషికంగా ఆయన 40 కోట్లను అందుకోనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకి 'లాయర్ సాబ్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించే దిశగా పనులు జరుగుతున్నాయి.