అది మార్ఫింగ్ చేసిన ఫొటో... వైరల్ చేయొద్దు: ఎయిర్ పోర్ట్ అథారిటీ
- అనువాదం తప్పంటూ ఫొటోను పోస్ట్ చేసిన బాలీవుడ్ నటి షబానా అజ్మీ
- నిజాలు తెలుసుకోకుండా వైరల్ చేయొద్దన్న ఏఏఐ
- 2015 నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోందని వెల్లడి
ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ ఇటీవల ఈ చిత్రాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. అనువాదం తప్పుగా ఉందని పేర్కొన్నారు. ఇంకేముందీ నెటిజన్లు ఈ ఫొటోను వైరల్ చేసేశారు. విషయం తెలుసుకున్న ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన చేసింది. "ఇది మార్ఫింగ్ చేసిన ఫొటో, 2015 నుంచి ఇది సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది, నిజాలు తెలుసుకోకుండా దీన్ని వైరల్ చేయవద్దు" అని కోరింది.