రకుల్ ప్రీత్ సోదరుడు హీరోగా 'నిన్నే పెళ్లాడతా'
రమ్య - శ్రీధర్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి వైకుంఠ బోను దర్శకత్వం వహిస్తున్నాడు. రెండు యాక్షన్ సీన్లు .. రెండు పాటల మినహా ఈ సినిమా టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ఈ సినిమా ద్వారా 'సిద్ధిక' అనే కథానాయిక పరిచయమవుతోంది. సాయికుమార్ .. సీత .. ఇంద్రజ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్ చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.