గోపీచంద్ మలినేనితో రవితేజ చేసేది 'తెరి' రీమేక్?
- తమిళంలో హిట్ కొట్టిన 'తెరి'
- గతంలోనే ట్రై చేసిన సంతోష్ శ్రీనివాస్
- కథానాయికగా శ్రుతి హాసన్
రవితేజతో 'తెరి' రీమేక్ చేయడానికి దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కొంతకాలం క్రితమే గట్టి ప్రయత్నాలు చేశాడుగానీ కుదరలేదు. ఇప్పుడు అదే 'తెరి' రీమేక్ ను గోపీచంద్ మలినేని చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ ను ఎంపిక చేసుకున్నారు. రవితేజ - శ్రుతి హాసన్ - గోపీచంద్ మలినేని కాంబినేషన్లో గతంలో 'బలుపు'వచ్చిన సంగతి తెలిసిందే.