నాగబాబు బర్త్ డే పార్టీ ఫొటోలు వైరల్!
- నిన్న నాగబాబు పుట్టిన రోజు
- శుభాకాంక్షల వెల్లువ
- తండ్రి ఫొటోలు పోస్ట్ చేసిన వరుణ్, నిహారిక
నాగబాబు మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. నిహారిక కూడా తన తండ్రికి బర్త్ డే విషెస్ తెలిపింది. తన తండ్రికి నుదుటిపై ముద్దు పెడుతోన్న ఫొటో పోస్ట్ చేసి 'ఐ లవ్ యూ నాన్న' అని పేర్కొంది. ఈ ప్రపంచంలో తనకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది తన తండ్రేనని, ఆయన గత జన్మలో తన కొడుకుగా పుట్టుంటారని ట్వీట్ చేసింది. నాగబాబు బర్త్ డే పార్టీ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
