రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'బిగిల్'
- ఈ నెల 25న వచ్చిన 'బిగిల్'
- తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకి పైగా వసూళ్లు
- ఓవర్సీస్ లోను అదే దూకుడు
ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే ఈ సినిమా 120 కోట్లను రాబట్టడం విశేషం. ఇంతకుముందు విజయ్ చేసిన 'సర్కార్' రెండు రోజుల్లో 100 కోట్లను సాధించగా, 'బిగిల్' ఆ మార్కును క్రాస్ చేసి ఆశ్చర్యచకితులను చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో 10 కోట్లకి పైగా వసూలు చేసిన ఈ సినిమా, ఓవర్సీస్ లోను అదే దూకుడు చూపుతోంది. ఈ రోజు నుంచి ఈ సినిమాకి లభించే ఆదరణను బట్టి, సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకోనుందనేది తెలుస్తుంది.