కొరటాల తరువాత ఛాన్స్ త్రివిక్రమ్ కే ఇచ్చిన చిరూ?
- చిరూతో కొరటాల సినిమా
- వచ్చేనెలలో సెట్స్ పైకి
- చిరూకి స్క్రిప్ట్ వినిపించనున్న త్రివిక్రమ్
త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాలనుందనే కోరికను చిరూ చాలా వేదికలపై వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ మధ్య చిరంజీవికి త్రివిక్రమ్ ఒక కథ చెప్పడం .. అది చిరంజీవికి నచ్చేయడం జరిగిపోయాయట. ఆ కథ పూర్తి స్క్రిప్ట్ ను కూడా ఇటీవల త్రివిక్రమ్ పూర్తి చేశాడట. త్వరలో ఆ స్క్రిప్ట్ ను చిరంజీవికి వినిపించనున్నాడనీ, చిరంజీవి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే, కొరటాల మూవీ తరువాత ఆయన చేయనున్న సినిమా ఇదే అవుతుందని అంటున్నారు.