బిగ్ బాస్ ఇంట్లో విజయ్ దేవరకొండ హంగామా
- లేటెస్ట్ ఎపిసోడ్ లో విజయ్ సందడి
- దీపావళికి స్పెషల్ గెస్ట్ గా రాక
- నాగ్ తో వినోదం
"నీ పెళ్లి గురించి ప్రతి ఆర్నెల్లకోసారి ఏదో ఒక రూమర్ వస్తోంది విజయ్" అని నాగ్ అడగ్గా, "నా అమల ఎక్కడుందో వెతుక్కుంటున్నా" అంటూ విజయ్ ఫన్నీగా రిప్లయ్ ఇచ్చాడు. దాంతో నాగ్ స్పందిస్తూ, "నీ అమల నీకు త్వరగా దొరకాలని ఆశీర్వదిస్తున్నా"నంటూ కామెంట్ చేశారు. మొత్తమ్మీద బిగ్ బాస్ సీజన్ 3 చివరిదశలో విజయ్ రాక ఇంటి సభ్యుల్లోనే కాకుండా ప్రేక్షకులను కూడా ఉత్సాహానికి గురిచేస్తుందనడంలో సందేహం లేదు.