చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ఖర్చుపై హైకోర్టు ఆశ్చర్యం.. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు
- ఢిల్లీలో చంద్రబాబు ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష
- రూ. 10 కోట్లు ఖర్చు కావడంపై హైకోర్టు ఆశ్చర్యం
- పూర్తి వివరాలను అందించాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశం
విచారణ సందర్భంగా, పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ అధికార పార్టీ లబ్ధి కోసం ఈ దీక్షను చేపట్టారని, దీనికి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని అన్నారు. దీంతో, రూ. 10 కోట్లను కేటాయిస్తూ జీవో జారీ చేసిన అధికారి ఎవరని హైకోర్టు ప్రశ్నించింది. ఏ నిబంధనల మేరకు ఈ నిధులను విడుదల చేశారని అడిగింది. సమస్యల పరిష్కారం కోసం ఇంత భారీ స్థాయిలో ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించింది. పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 21వ తేదీకి వాయిదా వేసింది.