మనకంటే మూడు రోజుల ముందే దీపావళి జరుపుకోనున్న ట్రంప్
- గురువారం నాడు వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు
- వేడుకల్లో మూడోసారి పాల్గొంటున్న ట్రంప్
- 2009 వేడుకలను ప్రారంభించిన ఒబామా
2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా వైట్ హౌస్ లో దీపావళి వేడుకలను ప్రారంభించారు. 2017లో భారత సంతతి అమెరికా నేతలతో కలసి ట్రంప్ తొలిసారి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. గత ఏడాది దీపావళి వేడుకలకు అమెరికాలోని భారత రాయబారి నవతేజ్ సింగ్ ను ట్రంప్ ఆహ్వానించారు. దీపావళి వేడుకలను ట్రంప్ జరుపుకోనుండటం ఇది మూడోసారి.