‘మా’లో తార స్థాయికి చేరిన వివాదం.. కాసేపట్లో జరిగే సమావేశంపై ఉత్కంఠ
- నరేశ్, రాజశేఖర్ మధ్య విభేదాలు
- నరేశ్ లేకుండా సమావేశం
- స్నేహపూర్వక సమావేశమే అంటున్న జీవితా రాజశేఖర్
అధ్యక్షుడు నరేశ్ లేకుండా ఈ సమావేశం ఎలా నిర్వహిస్తారని నరేశ్ తరఫు న్యాయవాది నిలదీస్తున్నారు. మరికాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. నరేశ్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని రాజశేఖర్ కార్యవర్గం యోచించినట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఉత్కంఠ నెలకొంది. ఇది స్నేహపూర్వక సమావేశమేనని మా ముఖ్య సలహాదారు కృష్ణంరాజు కూడా అంటున్నారు. ఈ సమవేశానికి వచ్చిన వారితో ఎలాంటి సంతకాలు పెట్టించబోమని తెలిపారు.