తనకు విడాకులు మంజూరైన విషయాన్ని బాధతో వెల్లడించిన మంచు మనోజ్!
- 2015లో ప్రణతిరెడ్డిని పెళ్లాడిన మంచు మనోజ్
- కొద్దికాలానికే కాపురంలో విభేదాలు
- విడాకులకు దరఖాస్తు
సీనియర్ నటుడు మోహన్ బాబు చిన్నకొడుకైన మనోజ్ 2015 మే 20న ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు. కానీ కొన్నాళ్లకే వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి. కలిసి ఉండడం కష్టమని భావించి విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మంచు మనోజ్ తన వ్యక్తిగత విషయానికి సంబంధించిన వివరాలను ట్వీట్ చేశారు.
తనకు విడాకులు మంజూరయ్యాయని, ఎంతో అందంగా అల్లుకున్న బంధం ముగిసిందని చెప్పడానికి హృదయం బరువెక్కిపోతోందని వ్యాఖ్యానించారు. ఈ కష్టకాలంలో తనకు కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యంగా వెంటనిలిచింది అభిమానులేనని మంచు మనోజ్ కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితంలో సమస్యలు తొలగిపోయాయని భావిస్తున్నానని, ఇకమీదట తనకెంతో ఇష్టమైన సినిమా రంగంలోకి మళ్లీ వచ్చేస్తున్నానని ప్రకటించారు.