సంక్రాంతి బరిలోకి 'ఎంతమంచివాడవురా'
- సతీశ్ వేగేశ్న నుంచి మూడో సినిమా
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
- సంక్రాంతి దిశగానే సన్నాహాలు
గ్రామీణ నేపథ్యంలో సాగే కుటుంబ కథా చిత్రం కావడంతో సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావించారు. ఆ దిశగానే తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే ఈ సారి సంక్రాంతికి గట్టిపోటీ వుంది. 'సరిలేరు నీకెవ్వరు' .. 'అల వైకుంఠపురములో' సంక్రాంతికి రావడం ఖరారైపోయింది. 'వెంకీమామ' కూడా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనవరి 10వ తేదీనే రజనీ 'దర్బార్' వచ్చేస్తుందని అంటున్నారు. ఇంత పోటీ ఉన్నప్పటికీ 'ఎంత మంచివాడవురా' వెనకడుగు వేయడం లేదని చెప్పుకుంటున్నారు.