జనసేనకు గుడ్ బై చెప్పి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన రాజోలు మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజు
- జనసేనకు గట్టి దెబ్బ
- క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న పవన్
- వైసీపీ తీర్థం పుచ్చుకున్న అల్లూరి కృష్ణంరాజు
కొన్నాళ్లుగా అల్లూరి కృష్ణంరాజు పార్టీ మారతారని ఊహాగానాలు గట్టిగానే వినిపించాయి. వ్యాపార రంగంలో ఉన్న ఆయనకు స్థానికంగా మంచి పట్టు ఉంది. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని ప్రణాళికలు రచిస్తున్న పవన్ కల్యాణ్ కు మాజీ ఎమ్మెల్యే నిష్క్రమణ నిరాశ కలిగించే విషయమని చెప్పాలి.