రాజశేఖర్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారట
- కన్నడలో హిట్ కొట్టిన 'కవుల్దారి'
- తెలుగు రీమేక్ లో సుమంత్
- వీరభద్రమ్ చౌదరితో రాజశేఖర్ చర్చలు
కన్నడలో సూపర్ హిట్ కొట్టిన 'కవుల్దారి' సినిమాకి ఇది రీమేక్. ఇది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సాగించే ఇన్వెస్టిగేషన్ స్టోరీ. అందుకే రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఏమైందో తెలియదుగానీ, రాజశేఖర్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారట. దాంతో ఈ సినిమాను సుమంత్ తో చేయడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇక వీరభద్రమ్ చౌదరితో రాజశేఖర్ కథా చర్చలు జరుపుతున్నారు. ఈ ప్రాజెక్టు సెట్ అవుతుందేమో చూడాలి మరి.