హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్
- అవన్నీ అక్రమ కేసులు..కొట్టివేయాలంటూ పిటిషన్
- నవంబర్ 2కు విచారణ వాయిదా వేసిన హైకోర్టు
- బెయిల్ పిటిషన్ పై త్వరలో విచారణ
ప్రస్తుతం రవిప్రకాశ్ హైదరాబాద్, చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్నారు. రవిప్రకాశ్ ను ప్రశ్నించడానికి తమ కస్టడీకి ఇవ్వాలని బంజారా హిల్స్ పోలీసులు కోరగా, కోర్టు అందుకు తిరస్కరించింది. మరోవైపు రవిప్రకాశ్ తనకు బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేసుకోగా దానిపై విచారణ జరగాల్సి ఉంది.