ఆసుపత్రిలో కేంద్ర ఆరోగ్య మంత్రిపై 'రంగు' పడింది!
- డెంగ్యూ నియంత్రణలో ప్రభుత్వ అలసత్వంపై ప్రజల ఆగ్రహం
- రోగి బంధువు మంత్రి అశ్వనీ చౌబేపై సిరా చల్లి నిరసన
- పాట్నా మెడికల్ కాలేజీ, హాస్పిటల్ సందర్శిస్తున్న సమయంలో ఘటన
అనంతరం పీఎంసీహెచ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో రోగి బంధువు ఒకరు మంత్రిపై సిరా చల్లాడు. రాష్ట్రంలో వరదలపై ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా వ్యవహరిస్తోందని అరిచాడు. అనంతరం అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదు.
బీహార్ ఆరోగ్య విభాగం ఇటీవల వెలువరించిన ప్రకటనలో సెప్టెంబరు నుంచి ఇప్పటివరకు 900 డెంగ్యూ కేసులు పాట్నాలో నమోదయ్యాయని పేర్కొంది. భారీ వర్షాలు, వరదలు పరిస్థితిని దిగజార్చగా.. 73 మంది ప్రాణాలు కోల్పోయారు.