అనుకోకుండా ఆర్టిస్టును అయ్యాను: దర్శకుడు రవిబాబు
నన్ను చూసిన వెంటనే 'మనం వెతుకుతున్న ఆర్టిస్ట్ దొరికేశాడు' అని ఫోన్లో అవతలివారితో చెప్పేశారు. అలా 'శివయ్య' సినిమాలో నటించాను. నిజానికి నేను ఆర్టిస్టును అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కొన్ని సినిమాల తరువాత, ఇండస్ట్రీకి నేను వచ్చింది ఆర్టిస్టును కావడానికి కాదు గదా అనుకుని మెగా ఫోన్ పట్టుకున్నాను. అప్పటి నుంచి డైరెక్షన్ పై ఎక్కువగా దృష్టి పెడుతూ, నటుడిగా కూడా కొనసాగుతున్నాను" అని చెప్పుకొచ్చాడు.