క్రికెటర్ శ్రీశాంత్ కు జోడీగా హన్సిక .. మరో హారర్ చిత్రానికి శ్రీకారం
- 3D టెక్నాలజీతో హారర్ మూవీ
- చివరిదశలో ప్రీ ప్రొడక్షన్ పనులు
- రంగంలోకి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు
ఈ సినిమాలో ఆమెకు జోడీగా క్రికెటర్ శ్రీశాంత్ కనిపించనున్నాడు. క్రికెట్ కి దూరమైన ఆయన అప్పటి నుంచి సినిమాల వైపు ఆసక్తిని చూపుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. 3D టెక్నాలజీతో రంగనాథన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి హరిశంకర్ - హరీశ్ నారాయణ్ దర్శకులుగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేయనుండటం విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ సినిమాను, త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.