సమైక్యపాలనలోనూ ఇలాంటి అరాచకాలు లేవు: తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్
- ప్రభుత్వం కార్మికులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందన్న లక్ష్మణ్
- తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నామని వెల్లడి
- ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యలు
పండుగ పూట కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేదని, ఆర్టీసీని నిర్వీర్యం చేసి, ఆస్తులను అనుచరులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తులపై కన్నేసి, ప్రైవేటీకరణకు మొగ్గు చూపుతున్నారని విమర్శించారు. ఇలాంటి పరిస్థితులతో విసిగిపోయిన ప్రజలు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు గతం వారం రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెకు బీజేపీ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తోందని, ప్రజా ఉద్యమాలకు బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని లక్ష్మణ్ స్పష్టం చేశారు.