'సైరా' చిత్రంపై అనుష్క వ్యాఖ్యలు
- చిరు, రామ్ చరణ్ లకు థ్యాంక్స్ చెప్పిన అనుష్క
- రాణి లక్ష్మీబాయిగా నటించిన అనుష్క
- ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు
మెగాస్టార్ చిరంజీవి తన పట్టుదల, అనుభవంతో సైరా నరసింహారెడ్డి పాత్రలో పరకాయప్రవేశం చేశారని, అలాంటి వ్యక్తి చిత్రంలో తాను కూడా నటించడాన్ని ఓ బాధ్యతగా భావించానని వివరించింది. సైరాలో తనను కూడా ఎంపిక చేసుకున్నందుకు చిరంజీవితో పాటు రామ్ చరణ్ కు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఓ నిర్మాతగా రామ్ చరణ్ ఎంతో గొప్పగా తీశాడని ప్రశంసించింది. ఈ బృహత్తరమైన ప్రయత్నంలో తనను భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్స్ చెప్పింది.