కేసీఆర్ తీరుతో తెలంగాణ ప్రజలు రగిలిపోతున్నారు: విజయశాంతి
- పండుగను అందరికీ దూరం చేసి ఆయన మాత్రం జరుపుకోవాలనుకుంటున్నారు
- ఈ దారుణ స్థితికి కేసీఆర్ మొండివైఖరే కారణం
- మరో ఉద్యమానికి సమయం ఆసన్నం
దసరాను రెండు తెలుగు రాష్ట్రాలు చాలా ముఖ్యమైన పండుగగా భావిస్తాయని కానీ, ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకోలేకపోతున్నారని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణ స్థితికి కేసీఆర్ మొండివైఖరే కారణమన్నారు. అందరికీ ఆనందాన్ని దూరం చేసి, తాను మాత్రం తన కుటుంబంతో దసరా పండుగను జరుపుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని, ఇది ఆయన దొరతనానికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్ తీరుపై మరోమారు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని విజయశాంతి హెచ్చరించారు.