'మీకు మాత్రమే చెప్తా' రిలీజ్ డేట్ ఖరారు
- వినోదభరిత చిత్రంగా 'మీకు మాత్రమే చెప్తా'
- ముఖ్యమైన పాత్రలో అనసూయ
- నవంబర్ 1వ తేదీన విడుదల
పోస్టు ప్రొడక్షన్ పనులు చివరి దశకి చేరుకుంటున్నాయి. నవంబర్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి దర్శక నిర్మాతలు వచ్చారు. మంచివాళ్లమనే పేరు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. ఆ ఇమేజ్ ను డామేజ్ చేసే చిన్నతప్పు జరిగినప్పుడు, దానిని సరిదిద్దుకునే క్రమంలో నుంచి పుట్టే కామెడీగా ఈ సినిమా సాగుతుందని చెబుతున్నారు. ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ నటుడిగా బిజీ అవుతాడేమో చూడాలి.