'కాంచన' హిందీ రీమేక్ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
- హిందీలోకి 'కాంచన' రీమేక్
- దర్శకుడిగా లారెన్స్
- హిజ్రా లుక్ తో అక్షయ్ కుమార్
తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను వదిలారు. కాళికాదేవి ఆలయంలో .. ఎర్రచీరతో హిజ్రా లుక్ తో అక్షయ్ కుమార్ కనిపిస్తున్నాడు. తన కుటుంబానికి అన్యాయం చేసిన ఒక వ్యక్తిని అంతం చేసే ప్రయత్నంలో భాగంగా 'కాంచన'లో లారెన్స్ నరసింహ స్వామి ఆలయంలోకి వెళతాడు. ఆ సన్నివేశాన్ని హిందీలో కాళికాదేవి ఆలయంలో ప్లాన్ చేసి వుంటారు. అందుకు సంబంధించిన పోస్టరే ఇది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.