'చంద్రముఖి'లో ఆ షాట్ ని రజనీ సార్ అప్పటికప్పుడు అనుకుని చేశారు: హీరో వినీత్
- నా కెరియర్లో మరిచిపోలేని సినిమా 'చంద్రముఖి'
- రజనీ సార్ తో కలిసి నటించడం అదృష్టం
- 'చంద్రముఖి' తనకి మంచి పేరు తెచ్చిందన్న వినీత్
ఈ సినిమాలో గుణశేఖర్ - చంద్రముఖి నాట్యం చేస్తుండగా రాజుగా వున్న రజనీసార్ వచ్చి కత్తితో గుణశేఖర్ తలను నరికేస్తాడు. స్క్రిప్టులో ఇంతవరకే వుంది. అయితే కిందపడిన గుణశేఖర్ తలను తన కాలితో కెమెరా వైపు తన్నడమనేది రజనీసార్ అప్పటికప్పుడు అనుకుని చేసింది. ఆ తరువాత ఆ షాట్ ఉంచాలా? తీసేయాలా? అనే చర్చ కూడా జరిగింది. 'చంద్రముఖి' పాత్ర పట్ల సానుభూతి పెరగాలంటే, ఆమె ప్రియుడి తలను తన్నే షాట్ వుంచడమే మంచిదనే అభిప్రాయాన్ని రజనీ సార్ వ్యక్తం చేయడంతో అలాగే ఉంచేశారు" అని చెప్పుకొచ్చాడు.