మొదటి నుంచీ కూడా నాకు క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టం: హీరో వినీత్
- 1985లో మలయాళ మూవీతో పరిచయం
- 'మలయాళంలో 'సర్గమ్' పేరు తెచ్చిందన్న వినీత్
- దానినే క్రాంతికుమార్ గారు 'సరిగమలు'గా రీమేక్ చేశారు
"మొదటి నుంచీ కూడా నాకు క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టం. అందువలన చాలా ఇష్టంగా నేర్చుకున్నాను. తొలిసారిగా 1985లో ఒక మలయాళ చిత్రంలో నటించాను. ఆ సినిమాలో నేను ఒక చిన్నపాత్రను పోషించాను. అదే సంవత్సరంలో చేసిన ఒక టీనేజ్ లవ్ స్టోరీతో నాకు బ్రేక్ వచ్చింది. ఆ తరువాత డిగ్రీ పూర్తిచేసి, అప్పటి నుంచి నటనపై పూర్తి దృష్టి పెట్టాను. మలయాళంలో నేను చేసిన 'సర్గమ్' సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమానే తెలుగులో 'సరిగమలు' పేరుతో క్రాంతికుమార్ గారు రీమేక్ చేశారు. ఈ సినిమాతో తెలుగులోను నాకు మంచి పేరు వచ్చింది" అని చెప్పుకొచ్చారు.