రాజకీయాల్లోకి వెళ్లొద్దని చిరంజీవికి చెప్పాను... కానీ వినలేదు: అమితాబ్
- సైరా ప్రమోషన్స్ తో చిరు, అమితాబ్ బిజీ
- ముంబయి వెళ్లిన చిరంజీవి
- మెగాస్టార్లను ఇంటర్వ్యూ చేసిన ఫర్హాన్ అక్తర్
తాజాగా, చిరంజీవి, అమితాబ్ లను ముంబయిలో నటుడు ఫర్హాన్ అక్తర్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా అమితాబ్ తన మిత్రుడు చిరంజీవి గురించి చెబుతూ, రాజకీయాల్లోకి వెళ్లొద్దని చిరంజీవికి చెప్పానని, కానీ ఆయన తన మాట వినలేదని అన్నారు. తాను చిరంజీవికి ఎన్నో సలహాలు ఇచ్చినా ఆయన ఏ కొన్నింటినో పాటిస్తారు తప్ప అన్నీ పాటించరని తెలిపారు.
చాలాకాలంగా చిరుతో స్నేహం ఉందని, ఊటీలో హమ్ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడే చిరంజీవి కూడా సెట్స్ మీద ఉన్నారని వెల్లడించారు. అప్పటికే చిరంజీవి గురించి చాలా విన్నానని, షూటింగ్ దగ్గర్లోనే జరుగుతుండడంతో వెళ్లి కలిశానని తెలిపారు. అక్కడ్నించి తమ స్నేహం మొదలైందని తెలిపారు.