సీఎం జగన్ పై కూన రవికుమార్ తీవ్ర విమర్శలు
- టీడీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు
- వైసీపీ తాటాకు చప్పుళ్లకు బెదరం
- టీడీపీ ఎప్పుడూ ప్రజల పక్షమే
టీడీపీ నాయకులపై, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తనపైనా వేధింపులకు పాల్పడుతోందని, అక్రమ కేసులు బనాయించారని వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తనపై అక్రమకేసులు బనాయించడం గురించి ఏమీ తెలియదని స్పీకర్ తమ్మినేని సీతారాం చెబుతున్న మాటలు అబద్ధమని విమర్శించారు. సీతారాం నోటి వెంట నిజాలు వస్తాయని ఈ జిల్లా ప్రజలు ఊహించరని ధ్వజమెత్తారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు బెదరమని, టీడీపీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజల పక్షమేనని స్పష్టం చేశారు.