పదో తరగతిలో ఉన్నప్పుడు తొలి ముద్దు ఇచ్చాను: వరుణ్ తేజ్
- తొలి ముద్దు నాకు ఒక చెడు జ్ఞాపకం
- దాని గురించి చెప్పలేను
- ఇప్పటి వరకు నాకు ఎక్కువ ప్రపోజల్స్ రాలేదు
ఫ్యాన్స్ తో మరిచిపోలేని సంఘటన ఏదైనా ఉందా? అనే ప్రశ్నకు బదులుగా... ఒక రోజు స్నేహితులతో కలసి ఓ క్లబ్ కు వెళ్లానని... పార్టీలో డ్యాన్స్ చేస్తుండగా వెనుక నుంచి ఓ అమ్మాయి తనను హత్తుకుందని వరుణ్ తెలిపాడు. తన స్నేహితుల్లో ఎవరో తనను పట్టుకున్నారని తొలుత అనుకున్నానని... అయితే అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తే అమ్మాయి కనిపించిందని చెప్పాడు. ఆ తర్వాత ఆమె తనను ముద్దు పెట్టుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలిపాడు. ఆ క్షణంలో తనకు ఎంతో భయం వేసిందని తెలిపాడు. తన జీవితంలో ఇప్పటి వరకు ఎక్కువ ప్రపోజల్స్ రాలేదని చెప్పాడు.